భారత్-జర్మనీ ఏడో అంతర్‌ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా ఆ దేశ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌తో మోదీ దిల్లీలో 2024, అక్టోబరు 25న భేటీ అయ్యారు. వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను తట్టుకొని భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక బంధం గట్టిగా నిలబడగలిగిందని మోదీ అన్నారు. భారత్‌తో మరింత పటిష్ఠ బంధం కోసం జర్మనీ ప్రకటించిన ‘ఫోకస్ ఆన్ ఇండియా’ వ్యూహాన్ని మోదీ స్వాగతించారు.
‘నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒడంబడిక’ సహా 18 ఒప్పందాలు/పత్రాలపై భారత్, జర్మనీ సంతకాలు చేశాయి.