కీలకమైన ఆర్థిక డేటాను కాపాడటానికి, ప్రధాన వ్యవస్థల కొనసాగింపును బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒడిశాలో అత్యంత సురక్షిత (హై-సెక్యూరిటీ) డేటా కేంద్రాన్ని నిర్మించింది. దాడులకు సుదూరంగా, వ్యూహాత్మక ప్రదేశంలో, భూకంప తీవ్రత లేనిచోట దీనిని నిర్మించారు. ఇందుకోసం టైర్ 4 సర్టిఫికేషన్ డిజైన్‌ను వినియోగించారని సమాచారం.
దేశ పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంపైకి మిస్సైల్, డ్రోన్ దాడులు ఉండే అవకాశం తక్కువ. ఈ డేటా కేంద్రం ఆర్‌బీఐకి రెండోది. ప్రాథమిక డేటా కేంద్రం నవీ ముంబయిలోని ఖార్ఘర్‌లో ఉంది.