కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, వ్యయాల హేతుబద్ధీకరణ సాధించడం కోసం దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)లను 28కి తగ్గించనున్నారు. ఇందుకోసం ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏకీకరణ అంశానికి సంబంధించిన చాలా పనులు పూర్తయ్యాయని, నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. విలీనం కాబోతున్న ఆర్‌ఆర్‌బీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 4, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో చెరి 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో 2 చొప్పున ఉన్నాయి.