Published on Jan 27, 2025
Current Affairs
ఒకే దేశం.. ఒకే సమయం
ఒకే దేశం.. ఒకే సమయం

దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2025, జనవరి 26న ముసాయిదా నిబంధనలు రూపొందించింది.

వీటిపై ఫిబ్రవరి 14లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. 

ఇందుకోసం తూనికలు కొలతలు (భారత ప్రామాణిక సమయం) నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు.

ఇవి అమల్లోకి వస్తే.. చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థికరంగాలతో పాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్‌టీ తప్పనిసరి.