Published on Dec 17, 2024
Current Affairs
ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు 1,913
ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు 1,913

తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2024-25) విద్యార్థులు లేని సర్కారు పాఠశాలలు 1913 ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

1831 ప్రాథమిక, 49 ప్రాథమికోన్నత, 33 ఉన్నత పాఠశాలల్లో అసలు విద్యార్థులు చేరలేదని తెలిపింది.

నల్గొండలో అత్యధికంగా 298 పాఠశాలలు జీరో ఎన్‌రోల్‌మెంట్‌గా ఉన్నాయి.

అతి తక్కువగా మేడ్చల్‌ మల్కాజిగిరిలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలున్నాయి.