Published on May 15, 2025
Government Jobs
ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం అండ్‌ భారత్ పెట్రోలియం జాయింట్‌ వెంచర్ అయిన ఐహెచ్‌బీ లిమిటెడ్‌ (ఐహెచ్‌బీఎల్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 25

వివరాలు:

1. డిప్యూటీ మేనేజర్‌(హెచ్‌ఎస్‌ఈ, మెకానికల్, ఫైనాన్స్‌): 03

2. సీనియర్‌ ఇంజినీర్‌(మెకానికల్‌, టెలికమ్‌ & ఇనుస్ట్రుమెంటేషన్‌(టీ&ఐ)): 04

3. ఇంజినీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌, సివిల్, ఐటీ): 14

4. ఆఫీసర్‌(ఫైనాన్స్‌): 03

5. ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, సీఏ/సీఎంఏ, బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌)లో  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్ ఇంజినీర్‌కు 35 ఏళ్లు, ఆఫీసర్‌/ఇంజినీర్‌కు 30 ఏళ్లు ఉండాలి.

జీతం: సంత్సరానికి డిప్యూటీ మేనేజర్‌కు రూ.11 లక్షలు, సీనియర్‌ ఇంజినీర్‌కు రూ.9 లక్షలు, ఇంజినీర్‌/ఆఫీసర్‌కు రూ.7లక్షలు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 5 వరకు.

Website: https://www.ihbl.in/careers