భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్), 2025-2026 విద్యా సంవత్సరానికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్): 80 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందన విశ్వవిద్యాలయం నుంచి హిస్టారికల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఫెలోషిప్: నెలకు రూ.17,600.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ స్టెజ్-1 రాత పరీక్ష, స్టేజ్2 ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ రెండు దశల్లో (మొత్తం 160 మార్కులు) ఉంటుంది.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత, జనరేట్ అయిన అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసి, సంతకం చేసి ఈ హార్డ్ కాపీతో పాటు పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, విద్యార్హత పత్రాల స్వయం ధ్రువీకరణ కాపీలను జతచేసి, పోస్ట్ ద్వారా మెంబర్ సెక్రటరీ, ఐసీహెచ్‌ఆర్, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ఫీజు: ఓబీసీలకు రూ.500;ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 10.04.2026.
ప్రింటెడ్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 17/04/2026.
Website:http://ichr.ac.in/v3/