Published on May 6, 2025
Current Affairs
ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌
ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌

ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో టీ20ల్లో ప్రపంచ ఛాంపియన్, వన్డే ప్రపంచకప్‌ ఫార్మాట్లలో టీమ్‌ఇండియా అగ్రస్థానంలో నిలిచింది.

2024 మే నుంచి జరిగిన మ్యాచ్‌ల ఫలితాలకు వంద శాతం పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ.. అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లకు సంబంధించి 50 శాతం రేటింగ్‌ పాయింట్లు కేటాయించింది.

భారత జట్టు టీ20ల్లో ప్రపంచ ఛాంపియన్, వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 

వన్డేల్లో భారత్‌ 124 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌ అయినప్పటికీ.. ఆ జట్టుకు మూడో స్థానమే దక్కింది. ఆసీస్‌తో సమానంగా 109 పాయింట్లే సాధించినప్పటికీ దశాంశాల తేడాతో కివీస్‌ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

టీ20ల్లో భారత్‌ 271 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా (262), ఇంగ్లాండ్‌ (254) వరుసగా 2, 3 స్థానాలు సాధించాయి. 

టెస్టుల్లో ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ (113), దక్షిణాఫ్రికా (111), భారత్‌ (105) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.