ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్ ఓపెనర్ స్మృతి మంధాన రెండో స్థానంలో నిలిచింది.శ్రీలంకలో భారత్ ముక్కోణపు సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఒక ర్యాంకును మెరుగుపర్చుకుంది. సిరీస్‌లో స్మృతి అయిదు ఇన్నింగ్స్‌ల్లో 264 పరుగులు సాధించింది. ఫైనల్లో శ్రీలంకపై 101 బంతుల్లో 116 పరుగులు చేసింది. నంబర్‌వన్ బ్యాటర్ లారా వోల్వార్ట్‌కు ఆమె కేవలం 11 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉంది. స్మృతి చివరిసారి 2019లో అగ్రస్థానం సాధించింది.