ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి నంబర్‌వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
2024, నవంబరు 27న ప్రకటించిన జాబితాలో రెండు స్థానాలు మెరుగైన బుమ్రా నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
రబాడ (దక్షిణాఫ్రికా), హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), రవిచంద్రన్ అశ్విన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు.