Published on Mar 10, 2025
Current Affairs
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మూడోసారి విజేతగా నిలిచింది.
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మూడోసారి విజేతగా నిలిచింది.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మూడోసారి విజేతగా నిలిచింది.

2025, మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది.

టీమ్‌ఇండియా 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో రోహిత్‌ శర్మ 76 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

భారత్‌కిది మూడో ఛాంపియన్స్‌ ట్రోఫీ. అత్యధికసార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. ఆస్ట్రేలియా (2006, 2009) రెండో స్థానంలో ఉంది.

2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా, 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్‌ సాధించింది.