Published on Apr 14, 2025
Current Affairs
ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ గంగూలీనే
ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ గంగూలీనే

ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ 2025, ఏప్రిల్‌ 13న నియమితుడయ్యాడు.

దుబాయ్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ ఛైర్మన్‌గా ఎనుకున్నారు.

మరో భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నాడు.

డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), హమిద్‌ హసన్‌ (అఫ్గానిస్థాన్‌), బవుమా (దక్షిణాఫ్రికా), జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లాండ్‌) కమిటీలో ఇతర సభ్యులు. 

అనిల్‌ కుంబ్లే స్థానంలో 2021లో గంగూలీ బాధ్యతలు అందుకున్నాడు.