Published on Dec 22, 2025
Government Jobs
ఐసీడీఎస్ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు
ఐసీడీఎస్ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ఐసీడీఎస్‌) వివిధ విభాగాల్లో అంగన్‌వాడీ వర్కర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య -  69

వివరాలు:

1. అంగన్‌వాడీ వర్కర్ 

2. మినీ అంగన్‌వాడీ వర్కర్  

3. అంగన్‌వాడీ హెల్పర్  

జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500. అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7,000.

వయోపరిమితి: జులై 1 2025 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన గమనిక

కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

తప్పనిసరిగా వివాహిత అయి ఉండాలి.

అభ్యర్థి ఏ గ్రామం/వార్డు/ఆవాస ప్రాంతంలోని ఖాళీకి దరఖాస్తు చేస్తున్నారో, అక్కడ తప్పనిసరిగా స్థానిక నివాసి అయి ఉండాలి.

ఎస్సీ/ఎస్టీ ఆవాస ప్రాంతాల్లోని ఖాళీలకు కేవలం ఆయా వర్గాల వారే అర్హులు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా .

చిరునామా: అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారాలను తమ పరిధిలోని ఐసీడీఎస్  ప్రాజెక్టు కార్యాలయంలో  నింపిన దరఖాస్తులను అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో కలిపి అదే కార్యాలయంలో స్వయంగా అందజేయాలి

దరఖాస్తు చివరి తేదీ: 30 డిసెంబరు 2025

Website:https://srisathyasai.ap.gov.in/notice_category/recruitment/