ముంబయిలో ఒకే రోజులో అతిపెద్ద కెరీర్ సలహా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించి, గిన్నిస్ రికార్డు సాధించినట్లు చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థ ఐసీఏఐ 2025, నవంబరు 28న వెల్లడించింది. ఈ సెషన్‌లో 7400 మందికి పైగా విద్యార్థులు, ఇతర వ్యక్తులు పాల్గొన్నారు. ‘కెరీర్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫర్ యూత్ (సీఏఎఫ్‌వై 4.0), సూపర్ మెగా కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్’ను నవంబరు 27న దేశవ్యాప్తంగా నిర్వహించారు.