హైదరాబాద్ ఐసీఏఆర్-సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ ( ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏ) సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రీసెర్చ్ ఫెలో: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ(అగ్రికల్చర్, డైరీ ఎకనామిక్స్, ఎకనామిక్స్, అగ్రిస్టాటిక్స్, స్టాటిక్స్, అగ్రోమెటీరియాలజీ, అగ్రి ఫిజిక్స్, అగ్రోనమీ, సోయిల్ సైన్స్, అగ్రి ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఐటీ, జీయోఇన్‌ఫర్‌మ్యాటిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 మార్చి 4వ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ. 37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: ఐసీఏఆర్- ఐసీఏఆర్-సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏ), సంతోష్ నగర్, హైదరాబాద్-500059.
ఇంటర్వ్యూ తేదీ: 4 మార్చి 2025