Published on Apr 24, 2025
Walkins
ఐసీఏఆర్‌-ఎన్‌ఏఏఆర్‌ఎంలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు
ఐసీఏఆర్‌-ఎన్‌ఏఏఆర్‌ఎంలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌-నేషనల్ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఏఆర్‌-ఎన్‌ఏఏఆర్‌ఎం) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో యంగ్‌ ప్రొఫెషనల్‌-2 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

యంగ్‌ ప్రొఫెషనల్-2: 08

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఏఎంఐఈ, డిగ్రీ, బీకామ్‌, బీబీఏ, బీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.42,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 5 నుంచి 8 వరకు.

Website: https://naarm.org.in/announcements/careers/