Published on Jan 10, 2026
Government Jobs
ఐసీఎస్‌ఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు
ఐసీఎస్‌ఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇంటలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఐసీఎస్‌ఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 50 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ (కంప్యూటర్‌లో ప్రావీణ్యం, టైపింగ్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి). ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల అర్హత గల డీఈఓలకు ప్రాధాన్యత ఉంటుంది.   

జీతం: నెలకు రూ.24,356.

వయోపరిమితి: 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.590.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 10.01.2026.

దరఖాస్తు చివరి తేదీ: 13.01.2026.

Website:https://icsil.in/walkin