రాజస్థాన్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రిసెర్చ్ ఆన్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఐసీఎంఆర్-ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సీడీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్-బీ, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బీ: 01
2. ఫీల్డ్ సూపర్‌వైజర్: 10
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు 40 ఏళ్లు, ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు 35 ఏళ్లు, ఎంటీఎస్‌కు 25 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.67,000, ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు రూ.40,000, ఎంటీఎస్‌కు రూ.15,800.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్ 10.