దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 12
వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్స్-I(అడ్మినిస్ట్రేషన్): 05
2. యంగ్ ప్రొఫెషనల్స్-II(అడ్మినిస్ట్రేషన్): : 06
3. యంగ్ ప్రొఫెషనల్స్-II(ఐటీ): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, ఐటీ అప్లికేషన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్స్-1 35 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్స్-2 40ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2025.