ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ స్వర్ణం సాధించాడు. 2025, ఆగస్టు 24న షింకెంట్ (కజకిస్థాన్)లో జరిగిన మ్యాచ్‌లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో 462.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. వెన్‌యు జావ్ (చైనా-462) రజతం, ఒకాడా (జపాన్-445.8) కాంస్యం గెలిచారు.