ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) పరిధిలోని మధుర రిఫైనరీలో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 108
వివరాలు:
టెక్నీషియన్ అప్రెంటిస్: 67
ట్రేడ్ అప్రెంటిస్: 41
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమేంటేషన్, అకౌంటెంట్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.01.2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ/ఎన్‌ఏపీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తరువాత గూగుల్ ఫారమ్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20.02.2026.
Website:https://iocl.com/