Published on Feb 12, 2025
Apprenticeship
ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్ విభాగంలో అప్రెంటిస్‌ పోస్టులు
ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్ విభాగంలో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్‌) పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని అయిదు రీజియన్‌లలో కింద పేర్కొన్న టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 457 (యూఆర్‌- 264, ఎస్సీ- 52, ఎస్టీ- 25, ఓబీసీ- 84, ఈడబ్ల్యూఎస్‌- 32, పీడబ్ల్యూబీడీ- 12).

వివరాలు:

పైప్‌లైన్ రీజియన్లు: వెస్ట్రన్‌, నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్ ఈస్ట్రన్‌.

ఖాళీల వివరాలు:

ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, అసిస్టెంట్‌ హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 28.02.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 03.03.2025.

Website:https://iocl.com/