Published on Nov 5, 2024
Apprenticeship
ఐవోసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) ఏడాది అప్రెంటిస్‌ (ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్) శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో శిక్షణ ఇస్తారు.

మొత్తం ఖాళీలు: 240

వివరాలు:

1. డిప్లొమా (టెక్నీషియన్)(ఇంజినీరింగ్): 120

2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్): 120

విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్.

అర్హత: విభాగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ (బీఏ/బీఎస్సీ/బీకామ్/ బీబీఏ/ బీసీఏ/ బీబీఎం) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.

శిక్షణ కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక.

స్టైపెండ్: నెలకు డిప్లొమా (టెక్నీషియన్) అభ్యర్థులకు రూ.10,500; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.11,500.

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-11-2024.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 06-12-2024.

ధ్రువపత్రాల పరిశీలన: 18-12-2024 నుంచి 20-12-2024 వరకు.

Website:http://boat-srp.com/