Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Current Affairs
ఐవోఎన్‌ఎస్‌ సమావేశం
ఐవోఎన్‌ఎస్‌ సమావేశం
  • సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తుల్లో ఉపశమన చర్యలు, పరస్పర సహకారంపై ఉమ్మడి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ మహాసముద్ర నావల్‌ సింపోజియం (ఐవోఎన్‌ఎస్‌) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఐఎఫ్‌ఆర్, మిలాన్, సింపోజియం పేరిట నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో భాగంగా 2026, ఫిబ్రవరి 20న తొమ్మిదో ఐవోఎన్‌ఎస్‌ సమావేశం జరిగింది. దీనికి హిందూ మహాసముద్ర తీర దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 33 దేశాల నావికాదళ అధిపతులు, సముద్ర భద్రతా సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
  • ఈ సింపోజియానికి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టింది. రాయల్‌ నేవీ నుంచి ఐవోఎన్‌ఎస్‌ అధ్యక్ష పదవిని భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌కుమార్‌ త్రిపాఠి స్వీకరించారు. 16 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ భారత్‌కు ఐవోఎన్‌ఎస్‌ అధ్యక్ష పదవి దక్కింది.