ఆయిల్ ఇండియా లిమిటెడ్.. అస్సాం రాష్ట్రం దులియంజన్‌లో వివిధ విభాగాల్లో గ్రేడ్ ఏ, బి, సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామాక ప్రకటన ద్వారా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, అకౌంట్స్, ఐటీ తదితర పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 102
వివరాలు:
సూపరింటెండింగ్ ఇంజినీర్ (గ్రేడ్ C)- 03
సీనియర్ ఆఫీసర్ (గ్రేడ్ B)- 97
కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ (గ్రేడ్ A)- 01
హిందీ ఆఫీసర్ (గ్రేడ్ A)- 01
విభాగాలు: ప్రొడక్షన్, ఆఫిషియల్ లాంగ్వేజ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, మెకానికల్, ఐటీ, ఫైర్ & సేఫ్టీ, పబ్లిక్ అఫైర్స్, హెచ్‌ఆర్, లీగల్, జియాలజీ, జియోఫిజిక్స్, హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, అకౌంట్స్ & ఆడిట్, కంపెనీ సెక్రటరీ, సెక్యూరిటీ మొదలైనవి.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ పీజీ, ఎంబీఏ/ పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు గ్రేడ్ సి పోస్టుకు రూ.80,000- రూ.2,20,000; గ్రేడ్ బి పోస్టుకు రూ.60,000- రూ.1,80,000; గ్రేడ్ ఏ కు రూ.50,000- రూ.1,60,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500 +జీఎస్‌టీ (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్/ఎక్స్-సర్వీస్‌మెన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26/09/2025.
తాత్కాలిక పరీక్ష తేదీ: 01.11.2025.