Published on Dec 11, 2024
Current Affairs
ఐరాస పర్యావరణ అవార్డు
ఐరాస పర్యావరణ అవార్డు

జీవావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ (82)కు ఛాంపియన్‌ ఆఫ్‌ ఎర్త్‌ అవార్డును ఐక్య రాజ్య సమితి (ఐరాసా) 2024, డిసెంబరు 10న ప్రకటించింది.

ఐరాసా ఏటా ప్రకటించే ఈ అవార్డు పర్యావరణ రంగంలో ఐరాస ఇచ్చే అత్యున్నత అవార్డు. 

పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు గాడ్గిల్‌ చేసిన కృషిని గౌరవిస్తూ సమితి ఈ అవార్డునిచ్చి సత్కరిస్తోంది.

ఈ ఏడాది (2024) ఛాంపియన్‌ ఆఫ్‌ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు గాడ్గిలే.