Published on Oct 2, 2024
Current Affairs
ఐరోపా దేశాలకు మన కాఫీ
ఐరోపా దేశాలకు మన కాఫీ

ఐరోపా దేశాలకు నేరుగా భారతీయ కాఫీని సరఫరా చేయడం కోసం ‘క్యూరియాసిటీ ఫ్యూయల్‌’ ప్రాజెక్ట్‌ను స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా (ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్‌) చేపట్టింది. ఇందు కోసం కర్ణాటకలోని కూర్గ్‌ కాఫీ తోటల యజమానులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. చెక్‌ రిపబ్లిక్‌లోని తన ప్లాంట్లకు దాదాపు 25 టన్నుల కూర్గ్‌ కాఫీని సరఫరా చేసినట్లు కంపెనీ వెల్లడించింది.