ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (ఆర్‌ఆర్‌బీ) నియామకాల కోసం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టిపర్పస్), ఆఫీసర్లు (స్కేల్ I, II & III) పోస్టులు భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13,217
వివరాలు:
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): 7972
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3907
ఆఫీస్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 50
ఆఫీస్ స్కేల్-II (లా): 48
ఆఫీస్ స్కేల్-II (సీఏ): 69
ఆఫీస్ స్కేల్-II (ఐటీ): 87
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 854
ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్): 15
ఆఫీసర్ స్కేల్ II (ట్రేజరీ మేనేజర్): 16
ఆఫీసర్ స్కేల్ III: 199
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, స్థానిక భాషాలో ప్రావీణ్యం ఉండాలి.
వయో పరిమితి: ఆఫీస్ అసిస్టెంట్‌కు 18- 28 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ Iకు 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ IIకు 21- 32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ IIIకు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష (ఇంటర్వ్యూ లేదు).
ఆఫీసర్ స్కేల్ I: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష + ఇంటర్వ్యూ.
ఆఫీసర్ స్కేల్ II & III: సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈఎస్‌ఎం/డీఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175; ఇతరులకు రూ.850.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.09.2025.
Website:https://ibps.in/