న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 344
వివరాలు:
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగిగా కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు: 01-09-2024 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.30,000.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీ మార్కులు, ఆన్‌లైన్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.750.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.10.2024.
Website:https://www.ippbonline.com/
Apply online:https://ibpsonline.ibps.in/ippblsep24/