ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సీ), మహేంద్రగిరి కేంద్రం అంతరిక్ష రంగంలో ప్రయోగ అనుభవం అందించేందుకు 2026 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 100
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్): 44
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్): 44
టెక్నీషియన్ అప్రెంటిస్: 44
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, బీఏ, బీఎస్సీ, బీకాం
అర్హత: గ్రాడ్యుయేట్ ఇంజినీరిగ్ అప్రెంటిస్‌కు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్)కు బీఏ, బీఎస్సీ, బీకాం, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు 2021 నుంచి 2025 మధ్య డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: గ్రాడ్యుయేట్ (ఇంజినీరిగ్, నాన్ ఇంజినీరింగ్) అప్రెంటిస్‌కు 28 ఏళ్లు; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ (ఇంజినీరిగ్, నాన్ ఇంజినీరింగ్) అప్రెంటిస్‌కు రూ.9,000; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీరిగ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 10.01.2026, గ్రాడ్యుయేట్ నాన్ ఇంజినీరింగ్‌కు 11.01.2026.