భారత ప్రభుత్వ సంస్థకు చెందిన మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సైట్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
1. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ (సివిల్): 10
2. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04
3. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ (ఎస్& టీ): 03
4. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ (లోకో/ మెకానికల్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.54,000.
వయోపరిమితి: 04.07.2025 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లోని మార్కులు, గేట్ స్కోర్, ఉద్యోగానుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్- నాలుగో అంతస్తు, నిర్మన్‌భవణ్, ముంబయి పోర్ట్ ట్రస్ట్ బిల్డింగ్, ఎం.పి రోడ్, మజ్‌గావ్. ముంబయి.
దరఖాస్తు చివరి తేదీ: 04-07-2025.