Published on Dec 7, 2024
Current Affairs
ఐడబ్ల్యూఎఫ్‌ నిర్ణయాలు
ఐడబ్ల్యూఎఫ్‌ నిర్ణయాలు

బరువు విభాగాలను తగ్గించాలని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది.

పురుషులు, మహిళల్లో గతంలో ఉండే 10 విభాగాలను 2025 జూన్‌ నుంచి 8 విభాగాలకు తగ్గించబోతున్నారు.

అలాగే బరువు విభాగాల్లోనూ మార్పులు చేశారు. తమ ఆవిష్కరణ కమిషన్‌ ప్రతిపాదన మేరకు ఐడబ్ల్యూఎఫ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇదివరకు పురుషుల్లో 55, 61, 67, 73, 81, 89, 96, 102, 109, +109 కేజీల బరువు విభాగాలుండేవి. 2025 నుంచి 60, 65, 71, 79, 88, 98, 110, +110 కేజీల విభాగాలను ప్రవేశపెట్టనున్నారు.

మహిళల్లో 45, 49, 55, 59, 64, 71, 76, 81, 87, +87 కేజీలకు బదులుగా 48, 53, 58, 63, 69, 77, 86, +86 కేజీల విభాగాలను తీసుకురానున్నారు.