Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.

Published on Nov 21, 2024
Government Jobs
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ బ్యాంకు జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 600

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ జనరల్: 500 పోస్టులు

2. అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్: 100 పోస్టులు

జోన్లు: అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ముంబయి, నాగ్‌పుర్, పుణె, పాన్ ఇండియా.

అర్హతలు: గ్రేడ్ ‘ఒ’- జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ; గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ/ బీటెక్‌/ బీఈ (అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీస్‌ సైన్స్/ ఇంజినీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/ టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణత అవసరం. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరి.

వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు. 

పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష సబ్జెక్టులు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ కంప్యూటర్/ ఐటీ (60 ప్రశ్నలు- 60 మార్కులు). గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాలి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2024.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-11-2024.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2024/ జనవరి 2025.

Website:https://www.idbibank.in/

ముఖ్యాంశాలు:

⫸ దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ బ్యాంకు 600 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీ ప్రక్రియ చేప‌ట్టింది. 

⫸ అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.