Published on Nov 7, 2024
Government Jobs
ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 2025-26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 1000 (యూఆర్‌- 448; ఎస్టీ- 94; ఎస్సీ- 127; ఓబీసీ- 231; ఈడబ్ల్యూఎస్‌- 100)

వివ‌రాలు:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.31,000.

దరఖాస్తు రుసుము: రూ.1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ పరీక్ష అంశాలు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ ఐటీ/ కంప్యూటర్/ (60 ప్రశ్నలు- 60 మార్కులు).

మొత్తం ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200.

పరీక్ష కాల వ్యవధి: 120 నిమిషాలు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు/ సవరణ తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01-12-2024.

Website:https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx