వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరిత్యాల కారణంగా 2024లో భారత్ 54 లక్షల తరలింపులను నమోదు చేసిందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ (ఐడీఎంసీ) నివేదిక పేర్కొంది.
ఇది గత 12 ఏళ్లలోనే అత్యధికమని వెల్లడించింది.
నివేదికలోని అంశాలు:
హింసాత్మక పరిస్థితుల కారణంగా భారత్‌లో 1,700 సందర్భాల్లో ప్రజలను తరలించారు.
2023లో మణిపుర్‌లో చోటుచేసుకున్న తరలింపుల కంటే ఇది కాస్త తక్కువ.
ఆ రాష్ట్రంలో 2024లోనూ హింస కారణంగా 1,000 సార్లు ప్రజల వలసలు నమోదయ్యాయి.
భారత్‌లో మూడొంతుల్లో రెండు వంతుల అంతర్గత వలసలు వరదల వల్లే చోటుచేసుకుంటున్నాయి.
వాతావరణ మార్పులు, అడవుల నాశనం, కోతలు, ఆనకట్టలు, గట్లను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ముప్పు ఎక్కువగా ఉంటోంది.