Published on Dec 19, 2024
Current Affairs
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌-హురున్‌ ఇండియా జాబితా
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌-హురున్‌ ఇండియా జాబితా

స్వయం కృషితో కుబేరులుగా ఎదిగిన 200 మంది ఔత్సాహిక వాణిజ్య వేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్, హురున్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. ‘ఇండియాస్‌ టాప్‌ 200 సెల్ఫ్‌ మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ద మిలేనియా 2024’ జాబితా అగ్రస్థానంలో అవెన్యూ సూపర్‌మార్ట్ప్‌ (డీమార్ట్‌) అధిపతి రాధాకిషన్‌ దమానీ (సంపద విలువ రూ.3.42 లక్షల కోట్లు) నిలిచారు. ఆయా సంస్థల విలువ ఆధారంగా వ్యవస్థాపకులకు ర్యాంకులు ఇచ్చారు.

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ రెండో స్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద ఏడాది కాలంలో 190% పెరిగింది. 

ర్యాంకు   వ్యవస్థాపకులు కంపెనీ- విలువ (రూ.కోట్లు)
1  రాధాకిషన్‌ దమానీ      అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 3,42,600
2  దీపిందర్‌ గోయల్‌   జొమాటో    2,51,900
3    శ్రీహర్ష మాజేటి, నందన్‌ రెడ్డి      స్విగ్గీ     1,01,300
4     దీప్‌ కర్లా, రాజేశ్‌ మాగో      మేక్‌మైట్రిప్‌       99,300
5  అభయ్‌ సాయ్‌      మాక్స్‌హెల్త్‌కేర్‌     96,100

ఫల్గుణి నాయర్‌ సహా 19 మంది మహిళలు జాబితాలో ఉన్నారు. జాబితాలో పిన్న వయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకులు కైవల్య ఓహ్రా (21) నిలిచారు.

అగ్రగామి 5 మంది స్వయంకృషీవలురు