ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు చేయూత అందించేందుకు రూ.2 లక్షల ఉపకారవేతనాన్ని అందిస్తోంది.
వివరాలు:
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025
అర్హత: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సూచించిన విద్యాసంస్థలో 2025-27 విద్యా సంవత్సరం రెండేళ్ల ఫుల్‌టైం ఎంబీఏ కోర్సులో మొదటి ఏడాది అభ్యసిస్తూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలు మించకూడదు.
ఉపకారవేతనం: ఏడాదికి రూ.లక్ష చొప్పున రెండేళ్లకు రూ.2 లక్షలు అందుతుంది. మొత్తం 700 మందిని ఎంపిక చేస్తారు.
వయోపరిమితి: అభ్యర్థులకు 35ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అడ్మిషన్ ఫారమ్, ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీ రిసిప్ట్, ఆదాయ, జనన ధ్రువీకరణపత్రం తదితరాలను అప్‌లోడ్ చేయాలి.
సందేహాలకు mbascholarship@idfcfirstbank.com సంప్రదించవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.07.2025.
Website:https://www.idfcfirstbank.com/csr-activities/educational-initiatives/mba-scholarship
Apply online:https://firstimpactscholarships.idfcfirstbank.com/