గ్రూప్ సి నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీబీపీ) ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 51.
వివరాలు:
1. హెడ్ కానిస్టేబుల్(మోటార్ మెకానిక్): 7 పోస్టులు
2. కానిస్టేబుల్(మోటార్ మెకానిక్): 44 పోస్టులు
అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు పన్నెండో తరగతి, మోటార్ మెకానిక్ సర్టిఫికెట్/ డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. కానిస్టేబుల్ ఖాళీలకు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 22-01-2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500 - రూ.81100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21700-రూ.69100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2024.