Published on Sep 4, 2024
Government Jobs
ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు
ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నాన్ గెజిటెడ్‌ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం ఖాళీలు: 819 (యూఆర్‌- 458, ఎస్సీ- 48, ఎస్టీ- 70, ఓబీసీ- 162, ఈడబ్ల్యూఎస్‌- 81)

వివరాలు:

పురుషులకు 697, మహిళలకు 122 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: మెట్రిక్యులేషన్/ 10వ తరగతితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 

శారీరక ప్రమాణాలు: పురుషులకు ఎత్తు 165 సెం.మీ., మహిళల ఎత్తు 155 సెం.మీ. పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి.

వయోపరిమితి (01-10-2024 నాటికి): 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,700 - రూ.69,100.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024.

Website:https://itbpolice.nic.in/

Apply online:https://recruitment.itbpolice.nic.in/rect/registrations/applicant-signup