Published on Nov 28, 2024
Government Jobs
ఐటీబీపీలో అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఐటీబీపీలో అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) అసిస్టెంట్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్/ వెటర్నరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేసింది. 

మొత్తం పోస్టులు: 27

వివరాలు:

అర్హతలు: బీవీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిఉండాలి. 

పే స్కేల్: నెలకు రూ.56,100-రూ.1,77,500.

గరిష్ఠ వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

పరీక్ష రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.400. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24-12-2024.

Website:https://recruitment.itbpolice.nic.in/rect/index.php