భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న గ్రూప్ 'సి' (నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
వివరాలు:
1. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: 12
2. హెడ్ కానిస్టేబుల్: 01
3. కానిస్టేబుల్: 07
విభాగాలు: ల్యాబొరేటరీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, సెంట్రల్ స్టెరిలైజేషన్ రూమ్ అసిస్టెంట్, టెలిఫోన్ అపరేటర్ కమ్ రిసెప్షనిస్ట్, డ్రెస్సర్, లెనిన్ కీపర్.
అర్హతలు: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయాలజీ), పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు రూ. 29,000-రూ.92,300; హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ. 25,500-రూ.81,100; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-రూ.69,100.
దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26-11-2024.
Website:https://itbpolice.nic.in/