సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది.
విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం 2025, జనవకి 17న నుంచి సింగపూర్ పర్యటన చేపట్టగా, మొదటి రోజునే ఈ ఎంవోయూ కుదిరింది.
స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.