భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్‌గా, వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం కార్యదర్శిగా డాక్టర్ మంగీలాల్ జాట్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ గ్లోబల్ రిసెర్చ్ ప్రోగ్రాం డైరెక్టర్‌గా ఉన్నారు. పదోన్నతిపై ఆయన్ను ఐకార్ డీజీగా నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకొంది. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.