Published on May 12, 2025
Admissions
ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025
ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025

2025-26 విద్యా సంవత్సరానికి వ్యవసాయ సంబంధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐకార్‌)- ఆలిండియా కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. 

వివరాలు:

ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (ఐకార్‌) ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2025

స్పెషలైజేషన్: క్రాప్ సైన్సెస్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్‌ ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, ఫిషరీ సైన్స్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్‌ అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌టెన్షన్‌, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 31.08.2025 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. 

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120. గరిష్ఠ మార్కులు 480.

దరఖాస్తు రుసుము: జనరల్/ యూఆర్‌ అభ్యర్థులకు రూ.2,000; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1955; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.1025.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 05.06.2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2025 నుంచి 09.06.2025.

పరీక్ష తేదీ: 03.07.2025.

Website:https://exams.nta.ac.in/ICAR/#