తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025’ అవార్డు అందుకున్నారు. కెన్యాలో 2025, డిసెంబరు 11న నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణం కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందించారు.
తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం తదితర కార్యక్రమాలు చేపట్టినందుకు సుప్రియా సాహూను అవార్డుకు ఎంపికచేశారు.