దేశీయ దిగ్గజ చమురు విక్రయ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కు తాత్కాలిక ఛైర్మన్‌లను ప్రభుత్వం 2024, ఆగస్టు 28న నియమించింది. వీటికి పూర్తి స్థాయి ఛైర్మన్‌లను నియమించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
* ఐఓసీకి తాత్కాలిక ఛైర్మన్‌గా సతీశ్ కుమార్ వడుగూరి బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 1 నుంచి మూడు నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.
* హెచ్‌పీసీఎల్‌కు కూడా సెప్టెంబరు 1 నుంచి మూడు నెలల పాటు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహించేందుకు రజ్‌నీశ్ నారంగ్‌ను ప్రభుత్వం నియమించింది.