అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ప్రెసిడెంట్‌గా క్రిస్టీ కోవెంట్రీ (41 ఏళ్లు) ఎన్నికైంది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఆమె నిలిచింది.
ఈ పదవికి ఏడుగురు అభ్యర్థులు పోటీ పడగా, 97 మంది సభ్యులు ఓట్లు వేశారు. 49 ఓట్లతో క్రిస్టీ తొలి రౌండ్లోనే విజయం సాధించింది. ఆమె 2033 వరకు పదవీలో కొనసాగుతుంది.
రెండుసార్లు ఒలింపిక్ స్విమ్మింగ్ స్వర్ణం గెలిచిన క్రిస్టీ.. ప్రస్తుతం జింబాబ్వే క్రీడల మంత్రి.