న్యూదిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఏడాది అప్రెంటిస్ (టెక్నికల్, నాన్ టెక్నికల్) శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దిల్లీ, హరియాణా, పంజాబ్, ఛండీఘడ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ - కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 382
వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్: 113
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 206
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 63
విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, విభాగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఏడాది.
శిక్షణ కేంద్రాలు: దిల్లీ, హరియాణా, పంజాబ్, ఛండీఘడ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ - కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-02-2025.
Website:https://iocl.com/