Published on Sep 21, 2024
Walkins
ఐఐసీటీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు
ఐఐసీటీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26

వివరాలు:

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 07

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 02

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-I: 05

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-II: 07

ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 04

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, నెట్/ గేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టుకు రూ.25,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-IIకు రూ.20,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-Iకు రూ.18,000; ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.49,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.28,000.

గరిష్ఠ వయోపరిమితి: ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు 40 ఏళ్లు; ఇతర పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 27, 30-09-2024.

వేదిక: ఐసీఎంఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌.

Website:https://www.iict.res.in/