Published on May 5, 2025
Admissions
ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు
ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు

ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) దేశవ్యాప్తంగా ఐఐపీ క్యాంపస్‌లలో 2025-2026 విద్యా సంవత్సరానికి పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ ప్యాకేజింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. ఎంఎస్‌ ప్యాకేజింగ్ టెక్నాలజీ 2025- 2027
క్యాంపస్‌: హైదరాబాద్, దిల్లీ.
వ్యవధి: రెండేళ్లు (ఫుల్‌ టైం)
అర్హత: బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
2. బీఎస్సీ ప్యాకేజింగ్ టెక్నాలజీ 2025-27
క్యాంపస్‌: దిల్లీ.
వ్యవధి: రెండేళ్లు (ఫుల్‌ టైం)
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/ బయాలజీ/ అగ్రికల్చర్‌ సైన్స్‌ & ఒకేషనల్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
3. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పీజీడీపీ)
క్యాంపస్‌: ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌.
వ్యవధి: రెండేళ్లు (ఫుల్‌ టైం)
అర్హత: సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
4. సర్టిఫైడ్ ప్యాకేజింగ్ ఇంజినీర్ (సీపీఈసీ)
క్యాంపస్‌: చెన్నై.
వ్యవధి: ఏడాది (ఆన్‌లైన్).
అర్హత: బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
5. డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ (డీపీసీ)
వ్యవధి: 18 నెలలు
అర్హత: డిగ్రీతో పాటు ప్యాకేజింగ్‌ రంగంలో ఏడాది ఇండస్ట్రియల్‌ అనుభవం.
6. ఇన్‌టెంన్సివ్‌ ట్రైనింగ్‌ కోర్స్‌ ఐటీసీ (సెప్టెంబర్‌- నవంబర్‌)
అర్హత: ఇంటర్మీడియట్‌, గరిష్ఠ వయోపరిమితి లేదు
వయోపరిమితి: 31/05/2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. సీపీఈసీ కోర్సుకు వయోపరిమితి లేదు.

ఎంఎస్‌/ పీజీడీపీ కోర్సు ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2025.

ప్రవేశ పరీక్ష తేదీ: 22.06.2025.

Website: https://www.iip-in.com/